విశాఖపట్నం: విశాఖలోనూ తాజ్మహల్ ఉంది తెలుసా?
తన భార్య ప్రేమకు గుర్తు గా షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ గురించి అందరికీ తెలుసు.. కానీ ఇంచుమించు అదే నేపథ్యం ఉన్న ప్రేమ కథ మన తెలుగునేలపై జరిగిందని మీకు తెలుసా..? ఆగ్రా లోని యమునా నది తీరాన తాజ్మహల్ ఉంటే, విశాఖపట్నం సాగర తీరాన మరో తాజ్మహల్ ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా…? తన భార్య ముంతాజ్ కు గుర్తుగా షాజహాన్ తాజ్ మహల్ నిర్మిస్తే.. దాన్ని ఆదర్శంగా తీసుకున్న కురపాం రాజా వీరభద్ర బహదూర్ కూడా తన భార్య గుర్తుగా ఈ మినీ తాజ్ మహల్ ను నిర్మించారు. ఈ రెండు కట్టడాలు ప్రేమకు చిహ్నాలే. విశాఖ సాగరతీరం వుడా పార్క్ నుండి భీమిలి వెళ్ళే రహదారి, వాల్తేరు సెంటర్లో ఉంది.