వనపర్తి: వనపర్తిలో ఆలయ ప్రవేశ వివాదం: బీజేపీ ఎస్సీ మోర్చా ధర్నా
వనపర్తి జిల్లా మంగంపల్లి గ్రామంలో దళితుడిని ఆలయంలోకి అడ్డుకున్నారనే ఆరోపణలపై బీజేపీ ఎస్సీ మోర్చా ఆందోళన చేపట్టింది. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.