ఆళ్లగడ్డ: భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో, ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో పెరుగన్నం కౌంటర్ ప్రారంభం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికులకు పెరుగన్న వితరణ చేశారు, ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఈ కౌంటర్ ను ప్రారంభించి మాట్లాడుతూ ప్రస్తుతం మండే వేసవిలో సత్యసాయి సేవా సమితి వారు మజ్జిగతో పాటు పెరుగన్నం వితరణ చేయడానికి వారు అభినందించారు, ఈ కార్యక్రమంలో డ్రైవర్లు రాజశేఖర్ రమణ లక్ష్మిరెడ్డి మెకానిక్ కృష్ణ తదితర ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు