డోన్: బేతంచర్ల మండలంలోని మద్దిలేటి స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి బుగ్గన
Dhone, Nandyal | May 31, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లమండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మాజీ మంత్రికి ఆలయ అధికారులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. పూజల అనంతరం వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరై ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆలయ మహాప్రకార నిర్మాణ పనులను బుగ్గన రాజేంద్రనాథ