డోన్: బేతంచెర్ల మండలంలో ఓ యువకుడు సూసైడ్
Dhone, Nandyal | Jun 28, 2026 నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం ఎం.పెండేకల్లో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయరాముడు అనే యువకుడు ఉరేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మార్గమధ్య లోనే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.