జహీరాబాద్: సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని డాక్టర్ ఆర్ ఎల్ ఆర్ పాఠశాలలో పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం పాఠశాలలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఎస్సై జగదీష్, సైబర్ ప్రతినిధి రషీద్ పాల్గొని మాట్లాడారు. మొబైల్ ఫోన్లో లాటరీల పేరుతో వచ్చే మెసేజ్లకు స్పందించవద్దన్నారు. ఓటీపీలు ఎవరికి సూచించవద్దన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపూరిత కాల్స్ వస్తున్నాయని అలా వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉంటూ తల్లిదండ్రులకు తెలపాలన్నారు.