యాడికి మండలం వేములపాడు సొసైటీలో సోమవారం కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. వేములపాడు సొసైటీ అధ్యక్షులు నాగ ముని రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడారు. కందులు క్వింటాలు రూ. 8000 కు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.