నంద్యాల జిల్లా బనగానపల్లెలోని సాదుకొట్టంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర సహిత శివలింగ మహోత్సవం ప్రతిష్ఠాపన గ్రామస్థుల ఆధ్వర్యంలో గురువారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు కిశోర్ శర్మ నందీశ్వర సహిత శివలింగం విగ్రహం ప్రాణప్రతిష్ఠ, హోమం చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.