నంద్యాల అర్బన్: మదర్స్ డే సందర్భంగా... నంద్యాల చిన్నారుల అద్భుత ప్రదర్శన
Nandyal Urban, Nandyal | May 10, 2026
నంద్యాలకు చెందిన ఇద్దరు చిన్నారులు అంతర్జాతీయ మాతృ దినోత్సవం పురస్కరించుకొని తమ చిట్టి చేతులతో అమ్మ అనురాగాన్ని చిత్రలేఖనం ద్వారా చూపించారు. ప్రణవ్ అనే బుడతడు 3వ తరగతి. అమ్మ ఆప్యాయత ఎలా ఉంటుందో అమ్మనే తనకు దేవత అనే విధంగా వేశాడు. మరొక చిన్నారి ఫర్హానా 5వ తరగతి. బిడ్డను చూసి తల్లి మురిసిపోతున్నట్లు అమ్మను దేవతగా చూపించింది.