అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా వడ్డుపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 29, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం వొడ్డుపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో అనంతపురం నగరానికి చెందిన బాలాజీ నాయక్ ధనరాజ్ నాయక్ అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 1033 నేషనల్ హైవే అథారిటీ వారి అంబులెన్స్ సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.