జూలూరుపాడు: జూలూరుపాడు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో బంగారు పుస్తెలు, వెండి మెట్టెలు, నగదు అపహరణ
అమ్మవారి ఆలయంలో బంగారం వెండి నగదు అపహరించిన దొంగలు సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో గురువారం ఉదయం తెల్లవారుజామున చోటుచేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలోని పెద్దమ్మ గుడిలో సుమారు రెండు లక్షల రూపాయలు విలువ కలిగిన నాలుగు జతుల బంగారు పుస్తెలు,నాలుగు జతుల వెండి మట్టెలు హుండీలోని సుమారు 3000 రూపాయలు చిల్లర డబ్బులు దోచుకెళ్లిన దుండగులు.. కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు.. పూర్తి వివరాలు పోలీసు వెల్లడించాల్సి ఉంది..