ఖైరతాబాద్: హిందూ స్మశాన వాటికలో మరిన్ని మెరుగైన వసతులు : కాచిగూడ లో స్మశాన వాటిక ట్రస్ట్ అధ్యక్షులు రాజేందర్ పటేల్ గౌడ్
హిందూ శ్మశానవాటికలో మరిన్ని మెరుగైన వసతులను ఏర్పాటు చేసే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు శ్మశానవాటిక ట్రస్ట్ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ అన్నారు. సోమవారం కాచిగూడలోని శ్మశానవాటిక ట్రస్ట్ కార్యాలయంలో రాజేందర్ పటేల్ అధ్యక్షతన ట్రస్ట్ ప్రతినిధుల సమావేశం జరిగింది. శ్మశానవాటికలో దహనవాటిక గద్దెలను ఆధునీకరించనున్నట్లు రాజేందర్ పటేల్ తెలిపారు.