సంతనూతలపాడు మండలం పేర్లమెట్టలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారి పావని ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో వ్యవసాయ శాఖ అధికారి పావని సమావేశమయ్యారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా మండలంలో ఎంతమందికి లబ్ధి చేకూరిందో ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఇంకా ఎవరికైనా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నగదు జమ కానట్లయితే ఈ కేవైసీ ని కంప్లీట్ చేసుకోని వారు వాటిని త్వరగా కంప్లీట్ చేసుకోవాలన్నారు. బ్యాంకు వివరాలు తప్పుగా నమోదైతే సంబంధిత బ్యాంకులకు వెళ్లి సరి చేసుకోవాలని సూచించారు. ఇలా చేసుకుంటే తిరిగి నగదు జమవుతుందన్నారు.