తీమలగుంట, మాడెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది, వ్యవసాయ రైతు సదస్సు నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు
గూడెం కొత్తవీధి మండలంలోని తీమలగుంట, మాడెం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది, వ్యవసాయ రైతు సదస్సు కార్యక్రమాలు నిర్వహించారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డీ.వెంకటేష్ బాబు, ఆయా గ్రామాల రైతులతో కలిసి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం వరిలో అగ్గి తెగులు సోకుతుందని ఏవో తెలిపారు. తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ మందును 0.6 గ్రాములు, లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.