కామారెడ్డి: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం పట్టణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జూకంటి ప్రభాకర్ రెడ్డి
కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ మరియు BRS పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ ఆదేశానుసారం బుధవారం ఉదయం 11 గంటలకు కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. జాతీయ జెండా ఆవిష్కరణ ను BRS పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, BRS పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని జాతీయ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.