చిన్నమండెం: గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
చిన్నమండెం మండలం చాకిబండ ప్రభుత్వ తెలుగు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బీవీ శ్రీధర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఉపాధ్యాయ వర్గంలో తీవ్ర విషాదం నెలకొంది.సహృదయ స్వభావం కలిగిన సౌమ్యుడిగా పేరుగాంచిన శ్రీధర్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల మండల వ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆయన మరణాన్ని స్మరించుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.