సంగారెడ్డి: రుస్తుంపేట శ్రీ లక్ష్మి నరసింహ ఆలయంలో లక్ష్య దీపోత్సవ కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే సునీత రెడ్డి
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నరసాపూర్ పట్టణం సమీపంలో ఉన్న రుస్తుంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో బుధవారం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీ యోగి రాజ వెంకట స్వామి గురు ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా బుధవారం కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నా