ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలని వైసిపి నాయకులు నిరసన
Ongole Urban, Prakasam | Apr 27, 2026
ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం వైసిపి నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని కట్టాలని కలెక్టర్ రాజా బాబుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనులకు పనికి రాని వాళ్లకు మస్టర్లు వేస్తున్నారని మొదటి నుంచి ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారన్నారు. వెంటనే ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపి అవినీతిగా పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు కలెక్టర్ ను డిమాండ్ చేశారు.