బనగానపల్లె: బనగానపల్లె బీసీ గురుకుల పాఠశాలకు స్పోర్ట్స్ కిట్లు అందజేసిన మంత్రి జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని రవ్వలకొండ ప్రాంతంలో ఉన్న బీసీ గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్లో ఆదివారం రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్రోత్సాహకార్ధం స్పోర్ట్స్ కిట్లు, స్నాక్స్ బాక్సులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి విద్యార్థుల సమక్షంలో ప్రిన్సిపల్ కు అందజేశారు. మంత్రి సతీమణికి ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు