గుంతకల్లు: న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పై పోలీసులు దాడి చేసి కొట్టడాన్ని నిరసిస్తూ గుత్తిలో న్యాయవాదులు విధులr బహిష్కరణ
కనగానపల్లి లో లాయర్ చంద్రశేఖర్ రెడ్డి పై పోలీసులు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడాన్ని నిరసిస్తూ గుత్తిలో న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్, సెక్రెటరీ నవీన్, సీనియర్ న్యాయవాది ఇస్మాయిల్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించారు. న్యాయవాదిని అకారణంగా కొట్టిన సీఐ,ఎస్ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు చంద్రకాంత్ రెడ్డి, సోమశేఖర్, రామ్మోహన్ రెడ్డి, ఓబులేసు, జాకీర్ లు పాల్గొన్నారు.