కామారెడ్డి: డెంగ్యూ, మలేరియా వ్యాధి ప్రబలకుండా జిల్లా వ్యాప్తంగా చర్యలు చేపట్టాలి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో సమీక్ష
కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం 6:00 సమయంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశంలో మాట్లాడారు.. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా నేల చిత్తడిగా మారి, నీరు నిలవ ఉండడం ద్వారా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా వ్యాధులు వ్యాపింపచేసే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పగడ్వాందిగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు.