డోన్: డోన్ మండలంలో ప్రభుత్వ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 18, 2026 డోన్ మండలంలోని యు. కొత్తపల్లి, మాల్యాల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన విధానం, మౌలిక వసతులు, పరిశుభ్రత, అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలును సమగ్రంగా పరిశీలించారు. పాఠశాల నిర్వహణలో ఉన్న లోపాలపై సంబంధిత అధికారులతో చర్చించి, వెంటనే సరిదిద్దాలని సూచించారు.