నందికోట్కూరు: కోళ్ల బావాపురం గ్రామానికి వెళ్లే గుంతల పడిన రోడ్డును బాగు చేయండి
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కోళ్ల బావాపురం గ్రామం నుంచి అలంపూరు కు వెళ్లే రోడ్డు మృత్యుపాషంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు, గుంతల మయమైన ఈ మార్గంలో ప్రయాణం ప్రణాంతకంగా మారిందని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తక్షణమే అధికారులు స్పందించి పటిష్టమైన రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు