నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో దారుణం, స్నేహితుల మధ్య గొడవ నవ వరుడు హత్య
Nandyal Urban, Nandyal | Apr 24, 2026
నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో స్నేహితుల మధ్య విభేదాలు హత్యకు దారితీశాయి. కుటుంబీకులతో కలిసి మనోజ్ కర్నూలు నుంచి తిరునాళ్లకు వచ్చారు. ఎప్పుడో 9వ తరగతిలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకొని మనోజ్ను వంశీ లాక్కెళ్లి గొంతులో కత్తితో పొడిచి చంపేశాడని మనోజ్ భార్య వెంకటేశ్వరి వాపోయారు. తనకు నెల క్రితమే వివాహమైందని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు గ్రామానికి చేరుకుని సమీక్షించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.