మహిళా అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా పని చేస్తా అమరావతిలో అసెంబ్లీ జాయింట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అమరావతిలో అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు శాసనమండలి చైర్మన్ మోహన్ రాజు అసెంబ్లీ ప్రాంగణంలో 8 జాయింట్ కమిటీల శాసనసభ తొలి సమావేశంలోఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ శాసనసభకు పని భారాన్ని తగ్గించేందుకు జాయింట్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో తాను కమిటీ సభ్యురాలుగా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజలు వృద్ధులు చిన్నారుల సమస్యలు తెలుసుకుంటామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.