కర్నూలు: కర్నూలులో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి: కర్నూలు న్యాయవాదులు డిమాండ్
కర్నూలులో హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని కర్నూలు హైకోర్టు సాధన సమితి నాయకులు రామాంజనేయులు, నరసింహులు, కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు జిల్లా కోర్టు న్యాయదేవత విగ్రహం నుంచి న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం, కొండారెడ్డి బురుజు, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుని, అక్కడ నిరసన వ్యక్తం చేశారు.