పుంగనూరు: కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపట్టారు.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ప్రవేట్ బస్టాండులో వైయస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటు కరణ కు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టి తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. బుధవారం ఉదయం 10:30 ప్రాంతంలో ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలకు కేవలం 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాష్ట్రానికి లక్షకోట్ల సంపద రాష్ట్రానికి వస్తుందన్నారు. మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర పూరితంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు.