గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ థామస్ యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. శనివారం ఎస్ఆర్ పురం మండలం ఎస్ఎల్వీ కళ్యాణ మండపంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.