నందికొట్కూరు పట్టణంలో ఘనంగా: హనుమాన్ జయంతి వేడుకలు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కోట వీధిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, జైశ్రీరామ్ నినాదాలు చేశారు, పట్టణంలోని అన్ని ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి, భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు, పట్టణం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది