నిమ్మనపల్లె బైపాస్ వద్ద ఎదురు ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె బైపాస్ వద్ద మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో తేజ మృతి చెందాడు. సంతోష్ జగదీష్ గాయపడ్డారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానికులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు . ఘటనపై మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.