ఒంగోలు అర్బన్: ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు
Ongole Urban, Prakasam | May 26, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ వద్దగుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ ఎస్ఐ శ్రీరామ్ తెలిపారు. రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటం వల్లే ఆ వ్యక్తి మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందిందని పేర్కొన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని వివరాలు తెలిసిన వారు నేరుగా జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.