ఒంగోలు అర్బన్: ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దటంలో ప్రతి ఒక పౌరుడు భాగస్వామ్యం కావాలి : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 6, 2026
150 సంవత్సరాల చారిత్రక నేపధ్యం ఉన్న ఒంగోలు నగరాన్ని క్లీన్ సిటిగా మార్చడంలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు నగర కార్పోరేషన్ ప్రత్యేక అధికారి రాజాబాబు పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ఒంగోలు నగరానికి చాలా ప్రాధ్యానత ఉందని, సుమారు 150 సంవత్సరాల క్రితం ఏర్పడిందని, ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 150 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.