యూసుఫ్‌గూడలో మైనర్ బాలుడిని పోలీసులు మూడు రోజులు స్టేషన్లో ఉంచారని కవిత అన్నారు. బుధవారం బాలుడిని పరామర్శించిన ఆమె.. అతడి ఆరోగ్యం, చదువు దెబ్బతిన్నా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోలేదన్నారు. ఖమ్మం హత్య కేసుతో పాటు ఈ అంశంపై డీజీపీ అపాయింట్మెంట్ కోరినా స్పందన రాలేదన్నారు. అజిత్‌కు న్యాయం చేసే దాకా పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.