రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 8, 2026
రెవిన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు చెప్పారు. బుధవారం ఆయన వలేటివారిపాలెం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో రెవెన్యూ సమస్యలు, గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరిస్తున్న తీరుపై సబ్ కలెక్టర్ హిమవంశీతో కలిసి ఆయన సమీక్షించారు. మండలానికి త్వరలోనే రెగ్యులర్ తహసీల్దారును నియమిస్తామని చెప్పారు. రెవిన్యూ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, అర్జీదారులకు సహేతుకమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.