ఒంగోలు అర్బన్: ప్రజల నుంచి అందిన వినతులకు నిర్దేశిత గడువులోపల నాణ్యమైన పరిష్కారం చూపాలి: కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 18, 2026
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన వినతులకు నిర్దేశిత గడువులోపల నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, జిల్లా రెవెన్యు అధికారి శ్రీధర్ రెడ్డి, ఎస్డిసిలు కళావతి, విజయజ్యోతి, డిపిఓ వెంకటేశ్వర రావు లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు.