మోతే: అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు: విభళాపురం గ్రామంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మోతె మండలం విభళాపురం గ్రామం లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి లతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ... విభళాపురం గ్రామం లో 146 ఇండ్లు మంజూరు చేయగా 74 ఇండ్ల పనులు మొదలు పెట్టి వివిధ దశలలో కొనసాగుతున్నాయని చెప్పారు.