జహీరాబాద్: జహీరాబాద్ లో ఇందిరా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిర్వహించిన ఇందిరా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ సురేష్ శెట్కర్ పాల్గొన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డివిజన్ లోని ఆరు మండలాలకు చెందిన మహిళలకు సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి తో కలిసి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తుందని ఎంపీ గుర్తుచేశారు. మహిళల్లో ఐక్యత పెంచేందుకు ఏకరూపకంగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.