బనగానపల్లె: బనగానపల్లెలో భక్తిశ్రద్ధలతో ముగిసిన మొహరం వేడుకలు
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బనగానపల్లె మొహర్రం వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ముగిశాయి. పట్టణంలోని పీర్లను జుర్రేరు వాగుకు ఊరేగింపుగా తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా శుద్ధి చేశారు. షియా మతస్థులు నల్లటి వస్త్రాలు ధరించి, మాతంలో పాల్గొంటూ పీర్ల దేవుళ్లకు రక్తతర్పణం సమర్పించారు. ఈ ఊరేగింపులో నవాబ్ వారసుడు మీర్ ఫజల్ అలీఖాన్, ఆయన కుమారుడు గులాం అలీఖాన్ పాల్గొన్నారు