నాగిరెడ్డిపేట: కుటుంబ కలహాలతో వివాహిత విషం తాగి ఆత్మహత్య, చికిత్స పొందుతూ మృతి : ఎస్సై భార్గవ్
నాగిరెడ్డిపేట మండలంలోని అచ్చాయిపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన భవాని (22) అనే వివాహిత విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఏడాదిన్నర కిందట వివాహం జరిగిన భవాని, ఆమె భర్త కొంపల్లి కమలాకర్ మధ్య గత ఆరు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ సమస్యలు తీరకపోవడంతో, మంగళవారం పొలానికి వెళ్లి విషం తాగింది. అపస్మారక స్థితిలో కనిపించింది వెంటనే ఆమెను నిజామాబాద్ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై భార్గవ్ పేర్కొన్నారు.