ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. యాక్సిడెంట్ అయిన విద్యార్థిని పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసులు. బాపట్ల జిల్లా ఇంకొల్లులోని డీసీఆర్ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంకొల్లు సర్కిల్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఓ విద్యార్థి పరీక్ష కేంద్రం కు వస్తున్న సందర్భంలో యాక్సిడెంట్ కారణంగా ఆలస్యం కావడంతో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ సమస్పూర్తిగా స్పందించి కాలేజీ యాజమాన్యానికి విషయాన్ని చెప్పి విద్యార్థిని డీసీఆర్ఎం పరీక్ష కేంద్రానికి ఆటోలో పంపించారు.