భిక్కనూర్: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగభూషణం(60) అనే వ్యక్తి మృతి చెందారు. సైకిల్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.