సంతనూతలపాడు: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం అనాలోచిత చర్య: వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
చీమకుర్తి పట్టణంలో సంతనూతలపాడు వైసిపి ఇన్చార్జ్ , మాజీమంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం శనివారం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని చూడడం అనాలోచిత చర్య అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు.