జహీరాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే మాణిక్ రావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో పక్షపాతం చూపుతూ అర్హులకు ఇండ్లు కేటాయించడం లేదన్నారు. ఈ ధోరణి మార్చుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరారు.