ఒంగోలు అర్బన్: విద్యుత్ ఛార్జీలు తగ్గాలంటే పునరుత్పాదక విద్యుత్తే ప్రత్యామ్నాయం: ఎమ్మెల్యే జనార్ధన్
Ongole Urban, Prakasam | Apr 14, 2026
రోజు రోజుకూ పెరుగుతున్న కరెంట్ వాడకం, పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు, ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రజలందరూ సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలోని ముక్తినూతలపాడు కాలనీలో ఒంగోలు లో ఎమ్మెల్యే మంగళవారం పర్యటించారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా గ్రామంలోని ఎస్సీ కుటుంబాలు ఏర్పాటు చేసుకున్న సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు.