తుక్కులూరు లో నీటి ప్రవాహంలో గల్లంతై మృతి చెందిన నీరజ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పార్థసారథి
Nuzvid, Eluru | Sep 17, 2025 నూజివీడు మండలం తుక్కులూరు గ్రామం లోని పాత హరిజనవాడకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని బడిపాటి నీరజ ఇటీవల ప్రమాదవశాత్తు వాగులో మృతి చెందడంతో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి బుధవారం బుధవారం మధ్యాహ్నం 2: 30 గంటలకు పరామర్శించారు. నీరజ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడుతూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నీరజ మృతితో ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావడంతో మరో ఐదు లక్షల రూపాయలు బీమా గా అందించనున్నట్లు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అన్ని విధాల నేరజా కు