నంద్యాల అర్బన్: నంద్యాల లో ట్రాఫిక్ కష్టాలు
Nandyal Urban, Nandyal | May 12, 2026
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. హనుమాన్ జయంతి సందర్భంగా బస్టాండ్ వద్దనున్న ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్టాండ్, బైర్మల్ స్ట్రీట్ ప్రాంతాల గుండా ప్రయాణించే వారు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. భక్తుల రద్దీ వల్ల ఏర్పడిన ఈ ట్రాఫిక్ చిక్కులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.