బనగానపల్లె: నొస్సం గ్రామదేవర కార్యక్రమంలో పాల్గొన్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామదేవర మహోత్సవ కార్యక్రమానికి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు. కాటసానికి గ్రామ వైసిపి నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసిపి నాయకులు ఇంట్లో విందులో పాల్గొన్నారు కాటసాని వెంట వైసీపీ కన్వీనర్ తిరుపాల్రెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మలికిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు