అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ నిర్వహించారు.ప్రజల సమస్యలను నేరుగా విని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించారు,కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు,భూ-ఆస్థి వివాదాలు,నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసాలు, ప్రేమపేరుతో మోసాలు, మరియు ఇతర సమస్యలపై ఎస్పీ గారు స్వయంగా విచారణ జరిపారు.