ఒంగోలు అర్బన్: ఓటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి న్యాయం జరగటం లేదు : బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్
Ongole Urban, Prakasam | May 22, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో బీసీవై పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశం సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సమావేశ హాలులో పూలే దంపతుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఆయన ప్రభుత్వం పైన ప్రతిపక్షం పైన ధ్వజమెత్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయలేదని రాష్ట్రంలో దోపిడీకి అవినీతి కంపెనీలకు నారా లోకేష్ సీఈఓ గా పెట్టారని విమర్శించారు రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు