కనిగిరి: తలకొండపాడు పంచాయతీకి చెందిన 13 వైసిపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిక
పెదచెర్లోపల్లి మండలంలోని తలకొండపాడు పంచాయతీకి చెందిన ఇద్దరు పంచాయతీ వార్డు సభ్యులతో పాటు మరో పదకొండు మంది వైసిపి కార్యకర్తలు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో కనిగిరి టిడిపి కార్యాలయంలో వైసీపీని వీడి టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన వారికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి పార్టీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టిడిపిలో చేరిన వారికి తగిన గుర్తింపును ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.